● విజిలెన్స్ ఏఎంవీఐ అపర్ణ
పాలకుర్తి టౌన్: స్కూల్ బస్సులు, ప్రైవేట్ వాహనా ల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలించ వద్దు.. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తామని విజిలెన్స్ ఏఎంవీఐ అపర్ణ స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలో వాహనాల తనిఖీ చేపట్టారు. సకాలంలో ట్యాక్స్ చెల్లించని రెండు వాహనాలను ఈ సందర్భంగా సీజ్ చేశారు. అనంతరం స్థానిక ప్రైవేట్ పాఠశాల బస్సులను తనిఖీ చేశారు. విద్యార్థుల తరలింపునకు కాకుండా ప్రైవేట్ కార్యక్రమాలకు బస్సులు వినియోగిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.