● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ రూరల్: చేతి రాతతోనే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అక్షర హ్యాండ్‌రైటింగ్ అకాడమీ ఎండీ.మేరాజ్ అహ్మద్ ఆధ్వర్యాన సోమవారం హైదరా బాద్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నిర్వహించిన రాష్ట్ర స్థాయి చేతి రాత పోటీల్లో 12వేల మంది పాల్గొన్నారు. పట్టణంలోని ఎస్‌ఆర్ ట్యూషన్ అకాడమీ విద్యార్థులు స్టేట్ బెస్ట్ పర్ఫెక్ట్ హ్యాండ్ రైటింగ్ అవార్డ్, స్పార్క్ అవార్డ్ దక్కించుకున్నారు. మరో 10 మంది విద్యార్థులు స్టేట్ విన్ అవార్డ్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు.