జనగామ: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25 శాతం రాయితీకి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉంది. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి గ్రామ పంచా యతీ పరిధిలో 35,615 దరఖాస్తులు రాగా, 3,713 మంది ఫీజు చెల్లించారు. ‘జనగామ, స్టేషన్‌ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలో 22,553 దరఖాస్తులు రాగా 1,013 మంది ఎల్‌ఆర్‌ఎస్ డబ్బులు చెల్లించగా పలువురికి ప్రొసీ డింగ్ కాపీలు ఇచ్చాం. మిగతా వారికి త్వ్రలో ఇస్తాం’. అని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు.
జనగామ బార్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
జనగామ రూరల్: జనగామ బార్ అసోసియేషన్ పూర్తి కమిటీకి గురువారం ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడిగా దండెబోయిన హరిప్రసాద్‌యాదవ్‌తో పాటు పలు పదవులు ఏకగ్రీ వం అయిన విషయం విధితమే. ప్రధాన కార్యదర్శి పదవికి పాలకుర్తి రామకృష్ణ, మన్నె సత్తయ్య పోటీపడగా.. రామకృష్ణ 28 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కార్యవర్గ సభ్యులు గా బి.చరణ్, ఎన్.శ్రీమాన్, ఇ.జోష్ణ, రవికుమార్, కె.దాసు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శ్రీరామ్ శ్రీనివాస్, అసిస్టెంట్ ఎన్నికల అధికారులు దొమ్మాటి సురేష్, జి.రాజశేఖర్‌యాదవ్ తెలిపారు.
ఘన్‌పూర్ బార్ అసోసియేషన్ కమిటీ ఏకగ్రీవం
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ బార్ అసోసియేషన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ మేరకు గురువారం స్థానిక కోర్టులో ఎన్నికల అధికారి, చీఫ్ టెల్లర్ పసునూటి రమేశ్ ఆధ్వర్యాన ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కనకం రమే శ్, ఉపాధ్యక్షుడిగా మునిగాల రవీందర్, ప్రధా న కార్యదర్శిగా ఎస్‌కే.షన్మకుమారి, మహిళా జాయింట్ సెక్రటరీగా పార్వతి శ్రీలత, లైబ్రరీ సెక్రటరీగా అమరోజు శ్రీనివాస్, కోశాధికారిగా టీఆర్.సాల్మన్‌రాజ్, కార్యవర్గ సభ్యులుగా గుర్రపు బాబు, మారపాక లక్ష్మణ్, తాడూరి వనిత, సిద్దం శ్వేత ఎన్నికయ్యారు. అనంతరం అధ్యక్షుడిని పలువురు సత్కరించారు.
మోర్ సూపర్ మార్కెట్‌కు రూ.10వేల జరిమానా
జనగామ: జిల్లా కేంద్రం సిద్దిపేటరోడ్డులోని మోర్ సూపర్ మార్కెట్‌కు రూ.10వేల జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి తెలిపా రు. ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ పులి శేఖర్‌తో కలిసి వారు గురువారం మార్టులో మూడు గంటల పాటు సోదా చేశారు. కాలపరిమితి పూర్తయిన సరుకులను ఇప్పటికే రెండు సార్లు విక్రయించి పట్టుబడిన మార్టులో ఇంకా ఏమైనా ఉన్నాయా అనే విషయమై తనిఖీ చేశారు. మరోసారి పట్టుబడితో సూపర్ మార్కెట్‌ను శాశ్వతంగా మూసి వేయిస్తామన్నారు. మేనేజర్‌తో అధికారులు లిఖిత పూర్వకంగా లెటర్ తీసుకున్నారు.
రేపు ఒడిబాల బియ్యం వేలం
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన 20 క్వింటాళ్ల ఒడిబాల బియ్యాన్ని ఈనెల 29న శనివా రం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఈఓ శేషుభారతి ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు రూ.5 వేలు దరావత్ సొమ్ము డీడీ రూపంలో చెల్లించి పాల్గొనాలని పేర్కొన్నా రు. పూర్తి వివరాల కోసం దేవస్థాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ఎల్‌ఆర్‌ఎస్ రాయితీకి మిగిలింది 4 రోజులే..