సమావేశంలో మాట్లాడుతున్న కటకం జనార్దన్
భూపాలపల్లి: కాంగ్రెస్ పార్టీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు పిచ్చి ప్రేలాపణలు మానుకోవాలని, లేదంటే అతడికి ప్రజల చేతిలో దెబ్బలు తప్పవని బీఆర్‌ఎస్ పార్టీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ హెచ్చరించారు. శనివారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండుసార్లు ఓడినా సత్యనారాయణరావుకు బుద్ధి రాలేదని, మూడోసారి ఓడాలని తహతహలాడుతున్నాడని అన్నారు. తమ నేత, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చట్టబద్ధంగా, న్యాయంగా భూములు కొనుగోలు చేస్తే కాంగ్రెస్ నాయకులు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అన్ని పార్టీలు మారిన అతడికి తమ నేతను విమర్శించే అర్హత లేదని చెప్పారు. ప్రజల అభీష్టం మేరకు ఎమ్మెల్యే గండ్ర టీఆర్‌ఎస్‌లో చేరితే సత్యనారాయణరావుకు కాంగ్రెస్ ప్లాట్‌ఫాం దొరికిందన్నారు. ఒక్కసారి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందితేనే జీవితానికి సరిపడా సంపాదించుకున్నాడని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇక అన్నీ అమ్ముతాడని విమర్శించారు. నీ భాష, వ్యవహార శైలి ప్రజలకు తెలుసని, రానున్న ఎన్నికలే నీకు చివరి ఎన్నికలన్నారు. మున్సిపాలిటీ వైస్‌చైర్మన్ కొత్త హరిబాబు మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ బహిరంగ సభతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. సత్యనారాయణరావు ఒక బ్లాక్‌మెయిలర్ అని, అతడి మాటలు ప్రజలు నమ్మబోరని చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ కళ్లెపు శోభ, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ సెగ్గం వెంకటరాణిసిద్ధు, బీఆర్‌ఎస్ నాయకులు నూనె రాజు, గండ్ర హరీశ్‌రెడ్డి, పైడిపెల్లి రమేష్, బద్ది సమ్మయ్య, మాదాసు తిరుపతమ్మ, చల్ల రేణుక, మురళి, లట్ట రాజబాబు పాల్గొన్నారు.
టపాసులు పేల్చి సంబురాలు..
రాష్ట్ర ప్రభుత్వం భూపాలపల్లికి బైపాస్ రోడ్డు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.
లేదంటే ప్రజల చేతిలో దెబ్బలు తప్పవు
బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్
Comments
Please login to add a commentAdd a comment