భూపాలపల్లి రూరల్: బంజార భూములతో పాటు వ్యవసాయానికి అనుకూలంగా లేని భూముల్లో సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసుకొని నిరంతరం రైతులు ఆదాయం పొందవచ్చని.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, రైతు సమూహాలు, నీటి వినియోగదారుల సంఘాలు, సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలు, పంచాయతీలు, గ్రామ సంస్థలు, మండల సమాఖ్యలు, డెవలపర్స్ సోలార్‌ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చని ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేసుకోవడానికి 3.5నుంచి 4ఎకరాల భూమి అవసరం ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 63049 03933 లేదా 90005 50974 నంబర్లలో సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment