గురువారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సర్వసతి
(అంతర్వాహిని)
త్రివేణి సంగమం
2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని గోదావరి తీరంలో ప్రధాన స్నానఘట్టాలకు దూరంగా వీఐపీ ఘాట్ నిర్మించారు. ఈ పదేళ్లలో ఇక్కడ ఈ ఘాట్ తప్ప మరో సౌకర్యం లేదు. సరస్వతి పుష్కరాల సందర్భంగా వీఐపీ ఘాట్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు.
● ప్రస్తుతం ఉన్న స్నానఘట్టాల పక్కన కొత్తగా 150 మీటర్ల పొడవుతో కొత్త స్నానఘట్టాలు నిర్మించనున్నారు.
● ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన టాయిలెట్స్, వాష్‌రూమ్స్ అందుబాటులోకి తేనున్నారు. దీంతోపాటు తాత్కాలిక ప్రాతిపదికన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు, టాయిలెట్స్ నిర్మించనున్నారు.
● వీఐపీల వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్లాట్, ఆ వాహనాలు సులువుగా రాకపోకలు చేసేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న సీసీ రోడ్డు విస్తరణ, మట్టి రోడ్డు స్థానంలో కొత్తగా రోడ్డు నిర్మించనున్నారు.
● ఇక్కడే బస చేయాలనుకునే వారి కోసం టెంట్‌సిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు.
● అద్దె ప్రాతిపదికన గుడారాలు బుక్ చేసుకుని త్రివేణి సంగమ ప్రదేశం దగ్గర భక్తులు బస చేయవచ్చు.
● ముఖ్యంగా వెదురు గుడారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
పశ్చిమ ఘాట్
సరస్వతి నది పుష్కరాలను పురస్కరించుకుని ముక్కంటి కొలువైన కాళేశ్వరం సరికొత్తగా ముస్తాబు కానుంది. మే 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించింది. వీటితో ఏయే పనులు చేయాలో జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. దేవాదాయ ధర్మాదాయశాఖ ద్వారా నిర్దేశించి, కలెక్టర్ రాహుల్‌శర్మ నియమించిన కన్సల్టింగ్ కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ జీఎస్‌వీ సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలోని ‘క్షేత్ర’సంస్థ మాస్టర్‌ప్లాన్ తయారుచేసింది. పుష్కరాల ఏర్పాట్లపై ‘సాక్షి’ ముందస్తుగా
అందిస్తున్న ప్రత్యేక కథనం..
– భూపాలపల్లి
గోదావరి నది
నదిలోనుంచి నిర్మించే రోడ్డు
టెంట్ సిటీ
తూర్పు ఘాట్
పశ్చిమ ఘాట్‌కు వెళ్లే దారి
కాళేశ్వరం
ఆలయం
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా..
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల పార్కింగ్ కోసం మూడు స్థలాలను ఎంపిక చేశారు. కాటారం–మహదేవపూర్ నుంచి వచ్చే భక్తుల కోసం కాళేశ్వరం దగ్గరలోని ఇప్పలబోరు సమీపంలో 3.29 ఎకరాలు, ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో 5.07 ఎకరాలు, మహారాష్ట్రలోని సిరొంచ నుంచి వచ్చే వాహనాలకు కన్నెపల్లి సమీపంలో 2.12 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయనున్నారు.
తూర్పు ఘాట్‌కు వెళ్లే దారి
కాటారం టు
కాళేశ్వరం దారి..
గుండం
చెరువు
పార్కింగ్
హిందూ పురాణాల్లో సరస్వతి నదిని అంతర్వాహినిగా పేర్కొంటారు. ఉత్తరాది ప్రజలు ప్రయాగ్‌రాజ్ దగ్గర గంగ, యమునా నదులు కలిసే చోట సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుందని నమ్ముతారు. మన దగ్గర దక్షిణ గంగగా పేర్కొనే గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానమైన కాళేశ్వరంలో సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుందని భక్తుల నమ్మకం. స్థల పురాణం ప్రకారం కాళేశ్వరం ఆలయంలో శివుడికి అభిషేకం చేసిన జలం ప్రత్యేక మార్గం గుండా ప్రవహించి ప్రాణహిత–గోదావరి సంగమ ప్రదేశం దగ్గర కలుస్తుందని, ఈ ప్రవాహం అంతర్వాహినిగా ఉండటం వల్ల సరస్వతి నదిగా పేర్కొంటారు. దీంతో దక్షిణ భారతదేశంలో సరస్వతి పుష్కరాలు కాళేశ్వరానికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
పోలీస్
కమిషనర్ ఆఫీస్
హరిత
హోటల్
భక్తులకు తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు.విశ్రాంతి తీసుకోవడానికి, పిండాలు సమర్పించడానికి వీలుగా స్నానఘట్టాల దిగువన వెదురుతో చలువ పందిళ్లు, ప్రధాన ఆలయం నుంచి స్నానఘట్టాల వరకు ఉన్న రోడ్డును రద్దీకి తగ్గట్టుగా విస్తరించనున్నారు. కాళేశ్వరంలో చూడదగిన ప్రదేశాలు ఏమిటి, ఎలా వెళ్లాలి అనే వివరాలు తెలిపేలా ప్రధాన కూడళ్లలో బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.
మహదేవపూర్ టు కాళేశ్వరం దారి
150 మీటర్ల మేర కొత్తగా స్నానఘట్టాలు..
న్యూస్‌రీల్
త్రివేణి సంగమం వరకు ప్రత్యేక దారి..
పుష్కరాలను పురస్కరించుకుని మూడు నదులు కలిసే సంగమ ప్రదేశం దగ్గర భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకోసం ప్రధాన ఘాట్‌తోపాటు వీఐపీ ఘాట్ నుంచి త్రివేణి సంగమం వరకు భక్తులు చేరుకునేలా ఇసుక బస్తాలతో 30 మీటర్ల వెడల్పుతో ప్రత్యేక దారిని, ఆ దారిపై పందిరిని ఏర్పాటు చేయనున్నారు. ఈ దారులకు ఇరువైపులా భక్తులు స్నానాలు చేయొచ్చు. లేదంటే సంగమం వరకు చేరుకుని స్నానాలు చేసేవిధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఎక్కువ లోతు ఉన్న ప్రదేశాలకు భక్తులు వెళ్లకుండా బారికేడ్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తారు. షిఫ్ట్‌నకు 12 మంది తగ్గకుండా మొత్తం 25 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు.
సకల సౌకర్యాలు
గురువారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
గురువారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
గురువారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment