కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తాం
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో మహాకుంభాభిషేకాన్ని అందరితో కలిసి గొప్పగా నిర్వహిస్తామని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. బుధవారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణరావుతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఆల య రాజగోపురం వద్ద మెట్ల మార్గాన్ని పరిశీలించి ఆలయంలోని పరంజా(కర్ర)లతో చేస్తున్న మెట్ల మార్గాన్ని పరిశీలించారు. మెట్ల కెపాసిటీ అడిగి తె లుసుకున్నారు. వీఐపీలు, సామాన్యుల వీక్షణకు ఎక్కడ ఉంటారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈఓ కార్యాలయంలో అధికారులతో కలిసి మహాకుంభాభిషేకం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కాళేశ్వరం దేవస్థానంలో ఈనెల 7, 8, 9 తేదీల్లో జరిగే మ హాకుంభాభిషేకం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. భక్తులు మెచ్చేలా ఏ ర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దా దాపు 42 సంవత్సరాలు తర్వాత జరుగుతున్న కార్యక్రమమం కావడంతో చాలా ప్రాధాన్యం ఉందన్నారు. ఈ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టి కృషి చే యాలన్నారు. భక్తులు కార్యక్రమం వీక్షించేందుకు వీలుగా ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీ నియంత్రణ, క్యూ పాటించడానికి వీలుగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ సునీత, దేవస్థానం ఈఓ మహేష్, డీపీఓ నారాయణరావు, ఇరిగేషన్,పీఆర్ ఈఈలు తిరుపతి, వెంకటేశ్వర్లు, డీపీఆర్‌ఓ శ్రీని వాస్, కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, మండల ప్రత్యేకాదికారి వీరభద్రయ్య, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, డీటీ కృష్ణ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఆలయ అర్చకులు కృష్ణమూర్తిశర్మ, ఫణీంద్రశర్మ, సీఐ రామచంద్రారావు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు.
మహాత్తర ఘట్టం మహా కుంభాభిషేకం
– వివరాలు 8లోu
ఈనెల 7, 8, 9 తేదీల్లో కార్యక్రమం
భక్తుల వీక్షణకు రెండు ఎల్‌ఈడీ స్క్రీన్‌లు
కలెక్టర్ రాహుల్‌శర్మ
ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
ఎస్పీ కిరణ్‌ఖరే
మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరగబోయే కుంభాభిషేకం, మహాశివరాత్రి, సరస్వతీ పుష్కరాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. బుధవారం ఆయన కాళేశ్వరంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 7, 8, 9వ తేదీల్లో కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వర స్వామి ఆలయంలో జరిగే కుంభాభిషేకం, మహాశివరాత్రి, మే నెలలో జరిగే సరస్వతీ పుష్కరాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వాహనాలకు సరైన పార్కింగ్ ఉండే విధంగా చూడాలన్నారు. ట్రాఫిక్ జాం కాకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాళేశ్వర ఆలయ పరిసరాలు, మెయిన్ ఘాట్, వీఐపీ ఘాట్‌లను, బైపాస్ రోడ్డును పరిశీలించారు. కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ చంద్రరా వు, ఎస్సై తమాషారెడ్డి ఉన్నారు.
కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తాం
Comments
Please login to add a commentAdd a comment