
10న ఐటీఐ అప్రెంటిస్‌షిప్ మేళా
కాటారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఈ నెల 10న ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా (పీఎంఎన్‌ఏఎం) నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదర్శ ఆటోమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోట ర్స్, శ్రీధర్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మరి కొన్ని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాకు హాజరవుతారని తెలిపారు. ఐటీఐ ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ విభాగాల్లో పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకొని మేళాకు హాజరుకావాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు బయోడెటా, అప్రె ంటిషిప్ రిజిస్ట్రేషన్, ఎస్‌ఎస్‌సీ మెమో, ఐటీఐ మెమో, ఎన్టీసీ, కుల ధృవీకరణపత్రం, ఆధార్, రెండు పాస్‌పోర్ట్ ఫొటోలతో హాజరుకావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆర్జిత సేవలు బంద్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో ఈనెల 7, 8, 9 తేదీల్లో జరిగే మహా కుంభాభిషేకానికి మూడు రోజుల ఆర్జీత సేవలను నిలిపివేస్తున్నట్లు ఈఓ మహేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుంభాభిషేకానికి వచ్చే భక్తులు దర్శనం చేసుకొని, అన్నప్రసాదం తీసుకోవాలని తెలిపారు.
ఇసుక లారీలు నిలిపివేత
ఈనెల 7, 8, 9 తేదీల్లో మహదేవపూర్ మండలం మీదుగా నడిచే ఇసుక లారీలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా టీజీఎండీసీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
పాఠశాల బస్సులు
శుభకార్యాలకు వాడొద్దు
● డీటీఓ సంధాని
భూపాలపల్లి: పాఠశాల యాజమాన్యాలు తమ బస్సులను శుభకార్యాలకు వాడొద్దని జిల్లా రవాణాశాఖ అధికారి మహ్మద్ సంధాని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. పాఠశాల బస్సులను విద్యార్థులను తరలించడానికి మాత్రమే ఉపయోగించాలన్నారు. వాహనాలు అన్ని పత్రాలు కలిగి ఉండాలని, స్కూల్ బస్సు నడిపే డ్రైవర్ కనీసం ఐదు సంవత్సరాలు హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌పై అనుభవం కలిగి ఉండాలన్నారు. లేదంటే బస్సులు సీజ్ చేస్తామన్నారు.
రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్‌గా ఉందని ఇంగ్లాండ్‌కు చెందిన జాన్ దంపతులు కొనియాడారు. రామప్ప దేవాలయాన్ని బుధవారం వారు సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం పాలంపేట శివారులో ప్రధాన రహదారి పక్కన నాటు వేస్తున్న కూలీలతో మాట్లాడారు. నాటు వేసే విధానం బాగుందని పేర్కొంటూ నాటు వేసే ఫొటోలను తమ సెల్‌ఫోన్‌తో తీసుకున్నారు. రామప్ప పరిసర ప్రాంతాలు అందంగా, ఆహ్లాదకరంగా ఉన్నాయని కొనియాడారు.
సైబర్ నేరాలపై
అవగాహన అవసరం
ములుగు: సైబర్ నేరాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరమని సైబర్ క్రైం డీఎస్పీ సందీప్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో వైద్యులు, విద్యార్థులకు బుధవారం జాగృక్త దివాస్ కార్యక్రమంలో భాగంగా అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్‌రెడ్డి మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీ, మల్టీలెవల్ మార్కెటింగ్(ఎంఎల్‌ఎం) పిరమిడ్ ఫ్రాడ్స్, జంప్డ్ డిపాజిట్ స్కాంలపై వివరించారు. ఒక వేళ ఎవరైనా సైబర్‌క్రైం బారిన పడితే వెంటనే 1930 టోల్ నెంబర్‌కి లేదా వెబ్‌సైట్ ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సైబర్ క్రైం స్థానిక అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి తగి న చర్యలు తీసుకుంటారని వివరించారు.
కాటమయ్య కి ట్‌ను
ఉపయోగించుకోవాలి
వెంకటాపురం(ఎం): ప్రతీ గీత కార్మికుడు కాటమయ్య కిట్‌ను ఉపయోగించుకోవాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పాలంపేటలో 40మంది గీత కార్మికులకు సేఫ్టీ మోకుల వినియోగంపై ట్రైనర్లు బుర్ర శ్రీనివాస్, గుంగెబోయిన రవి, రంగు సత్యనారాయణ, పులి రమేష్‌లు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కారుపోతుల సత్యం, రత్నాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment