
ఎన్నికల నియమావళి పాటించాలి
భూపాలపల్లి: రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళి పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించే అంశంపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఐడీఓసీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 10న గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఓటరు జాబితా అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఎంసీఎంసీ నోడల్ అధికారి శ్రీని వాస్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
మెరుగైన సేవలు అందించాలి..
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఉద్యోగుల బాధ్యత కీలకమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో గ్రూప్ 4 ద్వారా ఎంపికై కలెక్టరేట్‌లో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ సహాయకులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. ఫైల్స్ నిర్వహణలో ఏదేని సలహాలు, సూచనలకు పైఅధికారుల సూచనలు తీసుకోవాలన్నారు.
కలెక్టర్ హర్షం..
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4వ తేదీన నిర్వహించిన గార్డెన్ ఫెస్టివల్ పోటీల్లో ఉద్యాన విభాగంలో జయశంకర్ భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయానికి ఉ త్తమ ఉద్యాన విభాగంలో రోలింగ్ ట్రోఫీ, గోల్డెన్ గ్రీ న్ సర్టిఫికెట్ లభించడం పట్ల కలెక్టర్ రాహుల్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించిన 8వ గార్డెన్ ఫెస్టివల్, 2వ అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ ముగింపు ఉత్సవం సందర్భంగా ఈ అవార్డు ప్రదానం చేసినట్లు తెలిపారు. జిల్లా తరఫున జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధి కారి కె. శ్రీకాంత్‌రెడ్డి అవార్డు అందుకున్నారన్నారు.
ఉద్యోగుల బాధ్యత అత్యంత కీలకం
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment