
విద్యుత్ తీగలు అమర్చితే చర్యలు
ములుగు: వన్య ప్రాణులకు హాని కలిగించేలా పంట పొలాల చుట్టూ విద్యుత్ తీగలు అమర్చితే చర్యలు తప్పవని ఎస్పీ డాక్టర్ శబరీశ్ హెచ్చరించారు. ఈ మేరకు వైల్డ్‌లైఫ్ శాఖ తరఫున ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్‌ను బుధవారం ఎస్పీ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువుల ప్రాణాలు మనిషి ప్రాణా లతో సమానమన్నారు. పంటపొలాల చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే సెక్షన్ 105 బీఎన్‌ఎస్ కింద పదేళ్ల జైలుశిక్ష, ఎలక్ట్రిసిటీ యాక్జ్ 135 తరఫున మూడేళ్ల జైలు శిక్ష, వైల్డ్‌లైఫ్ ప్రోటెక్షన్ కింద మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. పోలీసు అధికారులు, విద్యుత్ సిబ్బంది గ్రామాల వారీగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, సీఐ శంకర్, ఎస్సై వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ డాక్టర్ శబరీశ్
Comments
Please login to add a commentAdd a comment