
కార్మికుల సమస్యలు పరిష్కరించండి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. కేటీకే 5వ గనిలో మ్యాన్ రైడింగ్‌ను పొడగించాలని, కొత్త టబ్బులను ఏర్పాటు చేసి నాణ్యత పాటించాలని, టబ్బుల రిపేరు సామానులు సరిగా రావడం లేదని, షూ, సాక్స్‌లు, వీల్స్ బోలోట్స్, ఇతర మెటీరియల్ నాసిరకంగా ఉంటున్నాయన్నారు. క్యాంటిన్‌లో నాణ్యతతో కూడిన అల్పాహారం అందించాలని, ఎస్‌డీఎల్ యంత్రాల మరమ్మతు పరిరకాలు లేక ఫిట్టర్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, నాయకులు రాజయ్య, జనార్దన్, శ్రీనివాస్, శ్రీధర్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment