జిల్లాకు చేరుకున్న పోరుయాత్ర
భూపాలపల్లి అర్బన్: పెండింగ్ కేసులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాధితులు చేస్తున్న పోరుయాత్ర బుధవారం భూపాలపల్లి ఏరియాకు చేరుకుంది. గొలేటి నుంచి కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం వరకు పోరుయాత్ర చేపడుతున్నారు. ఈ సందర్భంగా యాత్ర బుధవారం భూపాలపల్లి ఏరియాకు చేరగా ఎస్‌ఓటు జీఎం కవీంద్రకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే, మంత్రులు, కార్మిక సంఘాల నాయకులు ఈ సమస్యపై దృష్టిసారించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు శ్రీనివాస్, శ్రావణ్, సతీష్, నవీన్, సునీల్‌రెడ్డి, హరీష్, వెంకటస్వామి, కుమార్, రమేష్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment