భూపాలపల్లి రూరల్: జిల్లాలోని గోదాం ఇరుకుగా ఉండటంతో బియ్యం నిల్వ చేసుకోలేకపోతున్నామ ని, మరొక ఎంఎల్‌ఎస్ పాయింట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్ ఆధ్వర్యంలో బుధవారం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల, రేగొండ, గణపూర్, గోరి కొత్తపల్లి, భూపాలపల్లి ఏడు మండలాలకు రేషన్ షాప్ డీలర్లకు చిట్యాల ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి బి య్యం సరఫరా చేయాల్సి ఉంది. అయితే గోదాం ఇరుకుగా ఉండి బియ్యం నిల్వ చేసుకోలేక పోవడంతో సకాలంలో రేషన్ షాప్ డీలర్లకు బియ్యం సరఫరా చేయడం లేదు. ఈ విషయాన్ని గమనించి జిల్లా కేంద్రంలో మరొక ఎంఎల్‌ఎస్ పాయింట్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉద్యోగి డీఎస్‌ఓ శ్రీధర్‌కు శాలువాతో సన్మానించా రు. ఈ కార్యక్రమంలో డీలర్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి రమేష్, ఉపాధ్యక్షులు పద్మ, సుధమల్ల బాలకిషన్, రేకల రమేష్, బొచ్చు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్‌కు రేషన్ డీలర్ల వినతి
Comments
Please login to add a commentAdd a comment