భూపాలపల్లి అర్బన్: దేశవ్యాప్తంగా వ్యవసాయ భూమి లేని ప్రతీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల భూ పంపిణీ చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని శ్రామిక భవనంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేదలకు భూమి పంచడం వలన సంక్షేమ పథకాల అవసరం లేదన్నారు. దీంతో తమ అవసరాలు తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. బడాబాబుల కడుపులు మరింత నింపేందుకు, మధ్య తరగతి ఉద్యోగులను మభ్యపెట్టేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంత మొండిగా ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరుపుతున్న నేపథ్యంలో శ్రామికులు, ప్రజానీకం ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేందర్, శంకర్, రాజలింగు, శంకర్, రమా, ఆశోక్, రాజమణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment