ఆదాయానికి గండి | - | Sakshi
Sakshi News home page

ఆదాయానికి గండి

Published Sat, Feb 8 2025 8:22 AM | Last Updated on Sat, Feb 8 2025 8:22 AM

ఆదాయా

ఆదాయానికి గండి

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి మున్సిపల్‌ పరిధిలో కొందరు వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్స్‌లు పొందకుండా వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. మరికొందరు లైసెన్స్‌లను రెన్యువల్‌ చేసుకోవడంపై ఆసక్తి చూపడం లేదు. దీంతో రావాల్సిన ఆదా యాన్ని పురపాలక సంఘం భారీగా కోల్పోతోంది.

మున్సిపల్‌ పరిధిలో అధికారుల లెక్కల ప్రకారం 1,420పైగా వివిధ దుకాణ సముదాయాలు ఉండగా అధికారులు గుర్తించనివి మరో 100కి పైగా ఉన్నాయి. ఇప్పటివరకు వెయ్యి వరకు మాత్రమే లైసెన్స్‌లు తీసుకున్నారు. దీంతో ప్రతి ఏడాది రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు మున్సిపాలిటీ ఆదాయాన్ని కోల్పోతుంది.

మార్చి 31 గడువు..

ఎప్పటికప్పుడు భూపాలపల్లి మున్సిపల్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యాపారాలు చేసే వారిని గుర్తించి ట్రేడ్‌ లైసెన్స్‌లు జారీచేయాల్సి ఉంటుంది. కానీ.. ఆ దిశగా పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార గణాంకాల ప్రకారం.. పట్టణంలో 1,000కి పైగా ట్రేడ్‌ లైసెన్స్‌లు పొందిన వ్యాపారులున్నారు. ప్రతీ ఏడాది మార్చి 31లోపు వ్యాపారులు తమ లైసెన్స్‌లు పునరుద్ధరించుకోవాల్సి ఉండగా చాలామంది వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటివరకు దాదాపు 200 వరకు లైసెన్స్‌లు పునరుద్ధరణ కావాల్సిఉంది. ఈ మేరకు ఇప్పటికే మున్సిపల్‌ సిబ్బంది వ్యాపారులకు సూచనలు చేసినా ఫలితం లేదు.

దుకాణాలు ఎక్కువ..

లైసెన్స్‌లు తక్కువ

● భూపాలపల్లి జిల్లా కేంద్రం కావడంతో ప్రధాన రోడ్లతోపాటు వీధుల్లోనూ చాలా దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.

● వేలల్లో దుకాణాలు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ట్రేడ్‌ లైసెన్స్‌లను మున్సిపల్‌ నుంచి వ్యాపారులు తీసుకోవడం లేదు.

● చాలా మంది లైసెన్స్‌ లేకుండానే వ్యాపారాలు చేస్తూ మున్సిపల్‌ ఆదాయానికి గండి కొడుతున్నారు.

● మున్సిపల్‌ అధికారులకు తెలిసినప్పటికీ లైసెన్స్‌ల జారీకి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.

● గతంలో ఏ దుకాణం ఏర్పాటు చేసుకున్నా.. వ్యాపారం నిర్వహించినా విస్తీర్ణంతో సంబంధం లేకుండా రూ.1,000లను ట్రేడ్‌ లైసెన్స్‌ రుసుంగా చెల్లించేవారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ట్రేడ్‌ లైసెన్స్‌ల రుసుంలు భారీగా పెరిగాయి.

● ప్రధాన రోడ్లు, 60 ఫీట్ల రోడ్లు, 100 ఫీట్ల రోడ్ల, వీధుల్లో నిర్వహించే వ్యాపారాలను పరిగణలోకి తీసుకొని ట్రేడ్‌ లైసెన్స్‌ రుసుం వివిధ రకాలుగా వసూలు చేస్తున్నారు.

● బ్యాంకులు, వివిధ ప్రైవేట్‌ సంస్థల్లో రుణాలు తీసుకోవాల్సి వస్తే మాత్రం వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. మిగితావారు అదనపు భారంగా భావించి లైసెన్స్‌ తీసుకోకుండానే వ్యాపారాలు చేస్తున్నారు.

తప్పనిసరిగా తీసుకోవాలి..

వ్యాపారాలు చేసుకునే దుకాణాల యజమానులు తప్పకుండా ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకోవాలి. నిర్ణీత రుసుం చెల్లించి లైసెన్స్‌ పత్రాలు పొందాలి. ఏడాది కాగానే తిరిగి రెన్యూవల్‌ చేయించుకోవాలి. సిబ్బందిని బృందాలుగా విభజించి పన్నులు వసూలు చేస్తున్నాం.

– బిర్రు శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌, భూపాలపల్లి

ట్రేడ్‌ లైసెన్స్‌లపై ఆసక్తి చూపని వ్యాపారులు

లైసెన్స్‌ లేకుండా 400 దుకాణాల నిర్వహణ

ప్రతీ ఏడాది రూ.10లక్షల ఆదాయాన్ని కోల్పోతున్న మున్సిపల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
ఆదాయానికి గండి1
1/1

ఆదాయానికి గండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement