
ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి వేయాలి
పలిమెల: ఈనెల 10న నిర్వహించబోయే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 1–19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి వేసుకునేలా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విజయలక్ష్మి ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని పలిమెల, నీలంపల్లి, పంకెన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లకు పంకెన ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నేషనల్ డీ వార్మింగ్ డేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. నులి పురుగుల నివారణ కోసం డీ వార్మింగ్ డే రోజున పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు విధిగా వేసుకోవాలన్నారు. ఆ రోజున ఏదైనా కారణాలతో మాత్రలు తీసుకోని పిల్లలకు ఈనెల 17న మాప్ ఆఫ్ రోజున మాత్రలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్ లక్ష్మి, ఏఎన్‌ఎంలు పద్మ, లావణ్య, శ్రీలత, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రం పరిశీలన
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఉపయోగించనున్న పంకెన ఎంపీయూపీఎస్ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ ఉన్నారు.

ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి వేయాలి
Comments
Please login to add a commentAdd a comment