
పరిశుభ్రత చాలా ప్రధానం
కాళేశ్వరం: పరిశుభ్రత చాలా ప్రధానమని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు అన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై కాళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం డీఎల్‌పీఓ వీరభద్రయ్య, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓలు, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మూడురోజుల పాటు జరుగనున్న మహాకుంభాభిషేకం కార్యక్రమాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగిస్తూ పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహోత్సవ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారని, భక్తులు మెచ్చేలా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కుంభాభిషేకానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, పరిశుభ్రత విషయంలో అలసత్వం, రాజీ పడొద్దని అన్నారు. పారిశుద్ధ్య పనులను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సమన్వయంతో పనిచేసి కుంభాభిషేకం కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీఓలు ప్రసాద్, వీరస్వామి, ప్రకాశ్, కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment