హామీల అమలులో విఫలం
భూపాలపల్లి అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో విఫలమైనట్లు కార్మిక సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రియాజ్ అహ్మద్, కో కన్వీనర్ కృష్ణ ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో శనివారం హెఎంఎస్, టీఎస్‌యూఎస్, ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ, ఎస్‌జీకేఎస్ సింగరేణి ఐక్య సంఘాల ఐక్య వేదిక సంఘాల నాయకులు ముఖ్య నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు, ప్రాతినిఽథ్య సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే ఆ కార్మిక సంఘాలు పని చేస్తున్నట్లు ఆరోపించారు. కార్మికులకు రెండు గుంటల ఇంటి స్థలం, సొంత ఇంటి పథకం, వడ్డీ లేని రుణాలు అమలు చేయడం లేదన్నారు. నూతన బొగ్గు గనులు ప్రారంభించడం లేదని, ఆదాయ పన్ను రద్దు చేయడంలో విఫలమైందని చెప్పారు. మారు పేర్లతో కార్మికులు సతమతమవుతున్నారని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, డిస్మిస్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆయా సంఽఘాల నాయకులు గట్టయ్య, శ్రీనివాస్, సుదర్శన్‌గౌడ్, శ్రీనివాస్, శ్రీధర్, నరేష్, కిరణ్, శరత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment