
‘అవినీతికి కేరాఫ్ టీబీజీకేఎస్’
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో అవినీతి అక్రమాలకు పాల్పడిన సంఘంగా టీబీజీకేఎస్ నిలిచిందని ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బేతెల్లి మధుకర్‌రెడ్డి ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉండి సింగరేణిలో పదువులు అనుభవించి బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ ఓడిపోయిన 24గంటల్లోనే యూనియన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మిర్యాల రాజిరెడ్డి ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్‌పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సమస్యలను పరిష్కరించిన జనక్‌ప్రసాద్‌పై ఆరోపణలు సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర, ఏరియా నాయకులు రఘపతిరెడ్డి, రత్నం సమ్మిరెడ్డి, నర్సింగారావు, సమ్మిరెడ్డి, శ్రీనివాస్, రాయమల్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment