
కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, బీసీలకు న్యాయం
రేగొండ: కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, బీసీలకు సముచిత న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రేగొండ మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఎస్సీ, బీసీ కులగణన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇంటింటి కులగణన సర్వేచేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిపారు. 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, రాష్ట్ర నాయకులు నాయినేని సంపత్‌రావు, విజ్జన్‌రావు, గూటోజు కిష్టయ్య, పున్నం రవి, మైస భిక్షపతి, బొజ్జం రవి, మేకల భిక్షపతి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment