
అసంపూర్తిగా పల్లె దవాఖాన నిర్మాణాలు
మంగళవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సా..గుతున్న
పనులు
భూపాలపల్లి అర్బన్: పల్లె దవాఖాన భవన నిర్మాణ పనులు మూడేళ్లుగా సా..గుతున్నాయి. దీంతో పల్లె దవాఖానాలను అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా.. 17 భవనాల పనులు మాత్రమే పూర్తిచేశారు.
జిల్లాలో ఉపకేంద్రాల పరిస్థితి
జిల్లాలోని 13 ప్రాథమిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 90 ఉపకేంద్రాలు ఉన్నాయి. వాటిలో 21 పాత భవనాలలో నిర్వహిస్తున్నారు. 63 భవనాలకు అఽధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. వాటిలో ఆరు భవనాలకు మినహా మిగితా 57కు అనుమతులు జారీచేసి నిధులు కేటాయించారు. నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో 41 భవనాలు, 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ఆరు భవనాలు, ఐటీడీఏ కింద రెండు, రూర్బన్ పథకంలో రెండు భవనాలకు నిధులు మంజూరయ్యారు. ఒక్కో భవనానికి రూ.20లక్షలతో పనులు చేపడుతున్నారు. ఎన్‌హెచ్‌ఎం కింద ఒక భవనానికి టెండర్ కాలేదు. 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైనా ఆరు భవనాల పనులు చేపట్టగా.. నిధులు రాక అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఎన్‌హెచ్‌ఎం కింద ఆరు భవనాలు మాత్రమే పూర్తిచేయగా మిగతా 15 నిర్మాణ దశలో ఉండగా.. ఇంకా నాలుగు నిర్మాణ పనులే ప్రారంభించలేదు. ఆరు గ్రామాల్లో స్థల వివాదాలు ఉన్నాయి.
నిధులు రాక
నిర్మాణాలు ఆలస్యం..
జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం, 15వ ఆర్థిక సంఘం నిధులతో గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో 57 ఆరోగ్య ఉపకేంద్రాల భవనాలకు నిధులు మంజూరయ్యాయి. నిధులు రాక పలుచోట్ల భవన నిర్మాణ పనులు నిలిపివేశారు. ఇటీవల నిధులు విడుదలయ్యాయి. సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి పనులు వేగవంతం చేస్తాం. పనులు పూర్తిచేసిన భవనాలు ప్రారంభించాం.
– డాక్టర్ మధుసూదన్,
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
●
న్యూస్‌రీల్
ఆయా మండలాల పరిధిలో..
వివిధ మండలాల పీహెచ్‌సీల పరిధిలోని ఇస్సిపేట, కొత్తపల్లిగోరి, చల్లగరిగె, బుద్దారం, మైలారం, వేములపల్లి, గణపురం–1, రాఘవరెడ్డిపేట, నిజాంపల్లి, రేగులగూడెం, జూకల్ గ్రామాల్లో పనులు ప్రారంభంకాలేదు. పలిమెల, భూపాలపల్లి–2, కొండాపూర్, సీతారాంపూర్, ఒడిపిలవంచ, మెట్లపల్లి, పిడిసిల్ల, రంగాపూర్, కనిపర్తి, తాడిచర్ల–1, గర్మిళ్లపల్లి, వెలిశాల, కోటంచ, ఎడ్లపల్లి, టేకుమట్ల, కొత్తపల్లి, భాగిర్తిపేట, చెన్నాపూర్, రంగయ్యపల్లి, సుల్తాన్‌పూర్, మడ్తపల్లి, మొగుళ్లపల్లి గ్రామాల్లోని సబ్‌సెంటర్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
మూడేళ్లలో పూర్తి చేసినవి 17 భవనాలే..
జిల్లాలో 90 సబ్ సెంటర్లు
నూతనంగా 57 సబ్ సెంటర్లకు
నిధులు మంజూరు
పలు గ్రామాల్లో స్థల వివాదాలు

అసంపూర్తిగా పల్లె దవాఖాన నిర్మాణాలు
Comments
Please login to add a commentAdd a comment