ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలను నిర్వహించినట్లు ఫోరం జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రథమ బహుమతి ఎన్.సందీప్ (టైబల్ వెల్ఫేర్ కాటారం), రెండో బహుమతి కె.అలేఖ్య(జెడ్పీహెచ్‌ఎస్ కాళేశ్వరం), మూడో బహుమతి అభి రఘువరన్‌కల్యాణ్ (ట్రైబల్ వెల్ఫేర్, కాటారం) సాఽధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు లక్ష్మన్, రమేష్, రాజగోపాల్, జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గండు రాజబాబు, ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment