
ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దు
భూపాలపల్లి: ప్రజల ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దని ఎస్పీ కిరణ్ ఖరే జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం ప్రజాదివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్‌చేసి చట్టపరంగా చర్యలు తీసుకొని బాధితులకు న్యాయంచేయాలని ఆదేశించారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఆదేశించారు.
ఎస్పీ కిరణ్ ఖరే
Comments
Please login to add a commentAdd a comment