
వందశాతం పన్నులు వసూలు చేయాలి
భూపాలపల్లి అర్బన్: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పట్టణంలో రావాల్సిన అన్ని రకాల పన్నులను వంద శాతం వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పేరుకుపోయిన ఇంటి పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్‌ల రూపంలో పన్నులపై అలసత్వం వహించ వద్దని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 40శాతం పన్నులు మాత్రమే వసూళ్లు చేశారన్నారు. సమన్వయంతో పని చేస్తేనే వంత శాతం లక్ష్యాన్ని చేరుకుంటారని తెలిపారు. పట్టణ ప్రజలు సహకరించి పన్నులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు సహకరించాలని కోరారు.
డంపింగ్ యార్డ్ పరిశీలన
సీఆర్ నగర్ సమీపంలోఓని డంపింగ్ యార్డ్, వర్మి కంపోస్ట్ షెడ్, డీఆర్‌సీసీ, ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లను మంగళవారం కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. ఆయా సెంటర్లలో జరుగుతున్న పనులు పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో సేకరించిన చెత్తను వర్మి కంపోస్ట్ తయారు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని. డంపింగ్ యార్డ్‌లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీరు. విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు మానస, దేవేందర్, సానిటరీ ఇన్ప్‌ఫెక్టర్ నవీన్, జవాన్లు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment