
ఉపాధ్యాయులు సమర్థవంతంగా పనిచేయాలి
భూపాలపల్లి అర్బన్: ఉపాధ్యాయులు సమర్థవంతంగా పని చేసి విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని డీఈఓ రాజేందర్ ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపీ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. విద్యార్ధులు చదవడం, రాయడం, సంఖ్యా భావన, ప్రక్రియల చతుర్విద ప్రక్రియల్లో సామర్థ్యాలను పరిశీలించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించే విధంగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి చంద్రశేఖర్, సెక్టోరియల్ అధికారి రాజగోపాల్, ఉపాధ్యాయులు పాల్గోన్నారు.
సాంకేతికతను వినియోగించాలి
రేగొండ: విద్యా భోధనలో సాంకేతిక నైపుణ్యాలను వినియోగించి, భోదించడం వల్ల అర్థవంతమైన విద్యాభోదన సాధ్యమౌతుందని డీఈఓ రాజేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కొనసాగుతున్న కాంప్లెక్స్ స్థాయి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్(ఐఎఫ్‌పీ)పై నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ తరగతులను కొనసాగించడం వల్ల విద్యార్థి ప్రత్యక్ష అనుభూతికి లోపై అవగాహన చేసుకుంటాడని అన్నారు. తరగతిలో అవసరం మేరకు సాంకేతికతను వినియోగించాలన్నారు. అలాగే కోటంచ ప్రాథమిక పాటశాలలో విద్యార్థుల గణిత నైపుణ్యాలను పరిశీలించి, ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజన విధానాన్ని పరిశీలించారు. శిక్షణ శిబిరంలో మండల విద్యాధికారి వేల్పుల ప్రభాకర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమారి, క్వాలిటీ కో ఆర్డినేటర్ లక్ష్మన్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ రాజగోపాల్, డీసీఈబీ అసిస్టెంట్ సెక్రెటరీ కిషన్‌రెడ్డి ఉన్నారు.
డీఈఓ రాజేందర్
Comments
Please login to add a commentAdd a comment