
బర్డ్‌ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలి
కాటారం: పలు ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని కోళ్ల పెంపకదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా పశువైద్యాధికారి, సిబ్బంది కాటారం మండలంలోని గట్లకుంట, గంగారం గ్రామాల్లోని పౌల్టీఫాంలను పరిశీలించారు. ఫాంలో పెరుగుతు న్న కోళ్ల ఆరోగ్య పరిస్థితి, నిర్వాహణపై ఆరా తీశా రు. కోళ్లఫాంలలో అకారణంగా కోళ్లు చనిపోతే వెంటనే పశువైద్యాధికారులకు సమచారం అందించా లని సూచించారు. ఫాంల నిర్వాహణలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. బర్డ్‌ఫ్లూ వ్యాధి.. కోళ్లు, ఇతర పక్షుల నుంచి మనుషులకు, జంతువులకు తొందరగా వ్యాపిస్తుందని పేర్కొన్నారు. బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్ల ముక్కు, కళ్లు, నోటి నుంచి స్రావాలు కారుతాయని శ్వాస తీసుకోవడం వాటికి ఇబ్బంది గా ఉంటుందని, దగ్గు, గురక శబ్ధం వచ్చి ఆకలిమందిగించడం లాంటి లక్షణాలు ఉంటాయని తెలిపా రు. కోళ్లలో ఇలాంటి లక్షణాలు గుర్తిస్తే సమాచారం అందించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో బర్డ్‌ఫ్లూ ప్రభావం లేదన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పశువైద్యశాలను సందర్శించి రికార్డులు, మందుల స్టాక్ పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి ధీరజ్, పశువైద్యులు రమేశ్ ఉన్నారు.
జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి
Comments
Please login to add a commentAdd a comment