శనివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
వీఐపీ ఘాటు నుంచి సాధారణ పుష్కర ఘాటు వరకు భక్తులు పుణ్యస్నానాలు చేస్తుంటారు. స్నానాలు చేసిన అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలు, దర్శనాలు చేసుకుంటారు. మహాశివరాత్రి రోజున సుమారు లక్షకుపైగా భక్తులు పుణ్యస్థానాల చేసి దర్శనాలకు వెళుతుంటారు. సరస్వతీ పుష్కరాలకు 12 రోజుల పాటు రోజుకు 50వేల నుంచి లక్ష వరకు భక్తులు స్నానాలు చేస్తారని అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు స్నానాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అధికార యంత్రాంగం ముందస్తుగా గోదావరి ప్రాంతంలో కిలోమీటర్ మేర రక్షణ వలయాలు, ఎరుపు రంగు జెండాలు ఏర్పాటు చేయాల్సిందిగా భక్తులు కోరుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, చెన్నూర్, గోదావరిఖని, మంథని, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, జనగామ, బెల్లంపల్లి, మందమర్రి, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కాటారం, మహారాష్ట్ర వైపు సిరొంచ తదితర ప్రాంతాల యువకులు ఇక్కడ మృతిచెందిన ఘటనలు ఉన్నాయి. నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సూచిక బోర్డులు, ఎరుపు రంగు జెండాలు, గజ ఈతగాళ్లను జిల్లా అధికార యంత్రాంగం ముందస్తుగా ఏర్పాటు చేయాలి.
కాళేశ్వరంలోని త్రివేణిసంగమ గోదావరి
పుణ్యస్నానాలకు
గోదావర్రీ
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 25 నుంచి 27 వరకు మహా శివరాత్రి ఉత్సవాలు, మే 15నుంచి 26వరకు సరస్వతీ నది పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. వేసవి సమీపిస్తుండడంతో గోదావరిలో నీరు తగ్గుముఖం పడుతుంది. గోదావరిలో అక్కడక్కడా ఇసుక తరలిపోయి కయ్యలు, గోతులు ఏర్పడ్డాయి. దీంతో భక్తులు పుణ్యస్నానాలకు దిగి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. దేవాదాయ, ఇరిగేషన్, పోలీసు, పంచాయతీ, రెవెన్యూశాఖలు సంయుక్తంగా రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. రక్షణ ఏర్పాట్లు అధికారయంత్రం చేపట్టడం లేదు.
ఎంతో మంది మృత్యువాత..
యువత, పెద్దలు, మహిళలు, చిన్నారులు గోదావరిలో దైవదర్శనానికి వచ్చి స్నానాలకు దిగి లోతు ప్రవాహంలో చిక్కుకుని మృత్యుఒడికి చేరిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. కొంతమంది యువకులు ఈత వచ్చిన వారు కూడా గోతులు, కయ్యల్లో పడి మృతిచెందారు. ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురై తమ తల్లుల కడుపుకోతను మిగిల్చారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువత అర్ధాంతరంగా గోదారి పాలు కావడంతో తల్లిదండ్రుల రోదనలే మిగిలుతున్నాయి. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
నిత్యం విధుల నిర్వహణ..
గోదావరి వద్ద ఉత్సవాల రోజుల్లో కాకుండా నిత్యం ప్రమాద హెచ్చరిక బోర్డులు, రక్షణ వలయాలు, గత ఈతగాళ్లు గోదావరిలో ప్రమాదాల నివారణకు విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేయాలి. సంబంధితశాఖ తమ సిబ్బందిని ఏర్పాటు చేయాలి.
కాపాడుతున్న పోలీసులు..
ఆత్మహత్యకు పాల్పడేవారు సైతం కాళేశ్వరం త్రివేణి సంగమం గోదావరికి వచ్చి పురుగుల మందు, నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇంట్లో గొడవపడి వచ్చిన అలాంటి వారిని సైతం చాలామంది వృద్ధులను, మహిళలను స్థానికులు పోలీసులు కాపాడి తమ వారికి అప్పగించారు.
బ్యాక్ వాటర్‌తో పెన్సింగ్..
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 100ఎఫ్‌ఆర్ లెవల్ వరకు నీటి ప్రవాహం పెరిగితే భక్తులు స్నానాలు చేసేందుకు ఫెన్సింగ్‌ను కాళేశ్వరం పుష్కరఘాటు పొడవునా నిర్మించారు. అప్పుడు భక్తులు పెన్సింగ్ ఇవుతల స్నానాలు చేసేవారు. కానీ ఇప్పుడు మేడిగడ్డ బరాజ్‌లో నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో బ్యాక్‌వాటర్ నిల్వ లేదు. దీంతో గోదావరిలో నీరు రోజురోజుకూ తగ్గుతుంది. స్నానాలకు వచ్చే భక్తులకు సైతం నీటిలో చాలా దూరం వరకు వెళ్లాల్సి వస్తుంది.
రక్షణ చర్యలు చేపడుతాం..
భక్తులు లోతు ప్రవాహంలోకి వెళ్లకుండా మహాశివరాత్రి, సరస్వతీ పుష్కరాల కోసం ముందస్తుగానే రక్షణ చర్యలు తీసుకుంటాం. సంబంధిత శాఖలో సమన్వయంతో కలిసి పనిచేస్తాం. నిత్యం రక్షణ వలయాలు ఉండేలా ప్లాన్ చేస్తాం. ఉత్సవాలు జరిగినప్పుడే కాకుండా నిత్యం ఉండేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళుతాం.
– తిరుపతిరావు, ఈఈ,
ఇరిగేషన్‌శాఖ, మహదేవపూర్
న్యూస్‌రీల్
కిలోమీటరు మేర..
ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు శూన్యం
వివిధ రాష్ట్రాల నుంచి
పుణ్యస్నానాలకు భక్తజనం రాక
కయ్యలు, గోతుల్లో లోతు తెలియక ప్రమాదాలు
కనీసం సూచిక బోర్డులు
ఏర్పాటు చేయని అధికారులు
శనివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment