టీజీఎండీసీ ప్రాజెక్టు మేనేజర్ బదిలీ
కాళేశ్వరం: జయశంకర్‌భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల టీజీఎండీపీ ప్రాజెక్టు మేనేజర్ కె.శ్రీరాములును బదిలీ చేస్తూ ఆ శాఖ ఎండీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఇక్కడికి నల్లగొండ జిల్లా నుంచి పి.రంగారెడ్డి పీఓగా రానున్నారు. ఆయన స్థానంలోకి శ్రీరాములు నల్లగొండకు బదిలీ అయ్యారు. శ్రీరాములుపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆశాఖ విచారణ జరిపి బదిలీ వేటు వేసినట్లు తెలిసింది.
శ్రీనివాస్‌కు సన్మానం
ఏటూరునాగారం : రాష్ట్ర రవాణా శాఖ డైరెక్టర్‌గా ఎన్నికైన వసంత శ్రీనివాస్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌లో సన్మానించారు. బానాజీబందం గ్రామానికి చెందిన శ్రీనివాస్ డైరెక్టర్‌గా ఎంపికగా శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment