జిల్లా జడ్జిని కలిసిన మున్సిపల్ కమిషనర్
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబును మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకే అందజేశారు. భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీపై వచ్చిన సందర్భంగా కలిసినట్లు శ్రీనివాస్ తెలిపారు.
ఉపాధ్యాయులకు శిక్షణ
భూపాలపల్లి అర్బన్: జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్కూల్ హెల్త్, వెల్‌నెస్ ప్రోగ్రాంపై శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. ఆరోగ్య విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని, వారి ఆరోగ్య పరిస్థితులను గమనిస్తుండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఉపాధ్యాయులకు సూచించారు. మాస్టర్ ట్రైనర్లు ఉపాధ్యాయులకు అవగాహర కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు, పీహెచ్‌సీల వైద్యాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఏరియా ఆస్పత్రిని
తనిఖీ చేసిన సీఎండీ
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిని శుక్రవారం రాత్రి సింగరేణి సీఎండీ బలరాంనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న ఉద్యోగులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పురుషుల వార్డు, ఐసీయూల్లోకి వెళ్లి వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో వసతులు, కావాల్సిన సౌకర్యాల గురించి డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జీఎం రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సింగరేణి సీఎండీకి వినతి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌కు వినతిపత్రం అందజేసినట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని, జీఓ నంబర్ 22 ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించాలని కోరారు. ఈఎస్‌ఐ కార్డులు అందించాలని, సీఎంపీఎఫ్ పాసు బుక్కులు అప్‌డేట్ చేయాలని వినతిలో కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు ఆనంద్, రమేష్, సరళ, రమ, భిక్షపతి, బాబు, సారయ్య, శంకర్, సంపత్, తిరుపతి పాల్గొన్నారు.
ఇసుక క్వారీ తనిఖీ
మల్హర్: మల్లారం శివారులోని ఇసుక రీచ్‌ను మైనింగ్ ఏడీ స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్, ఆర్‌ఐ ప్రతాప్‌రెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్వారీలోని ఇసుక నిల్వలపై ఆరా తీశారు. లారీలో ఇసుక ఎంత మేరకు తీసుకెళ్తున్నారు. లోడింగ్ ఎంత చేస్తున్నారు.. వేబ్రిడ్జి కాంటాను, రికార్డులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వేబిల్లు లేకుండా, లారీల్లో అధిక లోడ్‌తో ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని క్వారీ నిర్వాహకులను హెచ్చరించారు.
2008 డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్
భూపాలపల్లి అర్బన్: 2008 డీఎస్సీ అభ్యర్థులకు శనివారం కలెక్టరేట్‌లోని డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాకు 43మంది అభ్యర్థులను కేటాయించగా 37మంది అభ్యర్థులు హాజరై సర్టిఫికెట్లు పరిశీలించుకున్నారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చారు. కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఎస్జీటీలు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేయనున్నారు.
జిల్లా జడ్జిని కలిసిన మున్సిపల్ కమిషనర్
జిల్లా జడ్జిని కలిసిన మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment