మేడారం జాతర సక్సెస్
ములుగు : మినీ మేడారం జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ శాఖ పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఎస్పీ డాక్టర్ శబరీష్ పర్యవేక్షణలో డీఎస్పీ ఎన్.రవీందర్ ఆధ్వర్యంలో భద్రత చర్యలు కట్టుదిట్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని 1,000 మంది పోలీసులకు ఆయా ప్రాంతాల్లో భద్రత కోసం విధులు కేటాయించారు. బుధవారం నుంచి శనివారం వరకు జరిగిన జాతర రెండు చైన్స్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా, సీసీ కెమెరాల ఆధారంగా సీసీఎస్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో 25 మంది సిబ్బందిని కేటాయించి అప్పటికప్పుడు వాటిని ఛేదించారు. దీంతో పాటు మంచిర్యాలకు చెందిన దొంగల ముఠాను గుర్తించి వారి నుంచి ఆటో, కారుతో పాటు రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంకకు చెందిన పర్యాటకురాలు పద్మ మినీ జాతరకు వచ్చి బ్యాగ్‌తో పాటు పాస్‌పోర్ట్ పోగొట్టుకోగా స్పందించిన పోలీసులు అరగంటలో ఛేదించి ఆమెకు పాస్‌పోర్టు అందజేశారు. ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి ఓఎస్‌డీ మహేష్ బిగితే ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ఎలాంటి తొక్కిసలాట జరుగకుండా చర్యలు తీసుకున్నారు. జంపన్నవాగు నుంచి సమ్మక్క గద్దెల మీదుగా ఆర్టీసి బస్టాండ్ కి వెళ్లే దారిలో, చిలుకలగుట్టకు వెళ్లే దారిలో ప్రతి క్షణం ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు సక్సెస్ అయ్యారు. పస్రా సీఐ జి.రవీందర్ గత మేడారం అనుభవం జాతరలో చాలా ఉపయోగపడింది.
Comments
Please login to add a commentAdd a comment