నేటి ప్రజావాణి రద్దు
భూపాలపల్లి అర్బన్: నేడు (సోమవారం) జరగనున్న ప్రజావాణిని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో శాసన మండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, జిల్లా యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణిని రద్దు చేసినట్లు తెలిపారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలి
భూపాలపల్లి అర్బన్: పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని నియంత్రిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని హెచ్‌పీసీఎల్ సెల్స్ అధికారి వెంకటేశ్వర్లు కోరారు. హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అధికంగా వినియోగిస్తున్నారని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు. ఎలక్ట్రికల్, సోలార్ వైపు దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్లు గండ్ర హరీశ్‌రెడ్డి, శ్యామ్, అశోక్‌రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.
టీజీఎండీసీ పీఓ
బాధ్యతల స్వీకరణ
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల టీజీఎండీసీ పీఓగా పి.రంగారెడ్డి కాళేశ్వరంలోని టీజీఎండీసీ కార్యాలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పీఓ ఇసుక క్వారీలను పరిశీలించారు. స్టాక్‌యార్డులు, లోడింగ్, వేబ్రిడ్జిల నిర్వహణను పరిశీలించారు. ఆయన వెంట బదిలీపై వెళ్లిన ఇద్దరు పీఓలు తారక్‌నాథ్‌రెడ్డి, శ్రీరాములు ఉన్నారు.
ప్రశాంతంగా
సీఓఈ ఎంట్రెన్స్ పరీక్ష
కాటారం: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఆదివారం నిర్వహించిన కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ ప్రవేశ పరీక్ష (సీఓఈ) ప్రశాంతంగా ముగిసింది. 320మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 295 మంది విద్యార్థులు హాజరుకాగా.. 25మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, గురుకులం డీసీఓ రాజేందర్ తెలిపారు. పరీక్ష అనంతరం విద్యార్థులకు పులిహోర ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ మాధవి, అబ్జర్వర్ నాగమణి, డిప్యూటీ వార్డెన్ నరేశ్, ఉపాధ్యాయులు, సిబ్బంది, పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి రూరల్: ఫిబ్రవరి 20న నిర్వహించనున్న చలో విద్యుత్ సౌధ కార్యక్రమం పోస్టర్‌ను జేఏసీ నాయకులు ఆదివారం సబ్‌డివిజన్ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీవీఏసీ జేఏసీ జిల్లా కన్వీనర్ మోత్కూర్ కోటి మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టుల్లోకి కన్వర్షన్ చేయాలన్నారు. ఐటీఐ చేసిన వారికి జేఎల్‌ఎం, డిగ్రీ చేసిన వారికి జూనియర్ అసిస్టెంట్, టెన్త్ క్లాస్ చదివిన వారికి ఆఫీస్ సబార్డినేట్, డిప్లమో చేసిన వారికి సబ్ ఇంజనీర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులుు ఎండీ అంకుషావలి, సురేందర్ రెడ్డి, మచ్చిక వెంకటేశ్వర్లు, బత్తుల రాజేందర్, శ్యామ్ వేణు, శ్రీనివాస్, రంజిత్, దేవేందర్ పాల్గొన్నారు.
సింగరేణి కార్మికుడి మృతి
భూపాలపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భూపాలపల్లి ఏరియాకు చెందిన సింగరేణి కార్మికుడు పూజారి అనిల్(31) మృతిచెందాడు. మంచిర్యాలలో వివాహ వేడుకకు పట్టణానికి చెందిన నలుగురు కారులో వెళ్లివస్తున్నారు. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అనిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. అనిల్ ఏరియాలోని కేటీకే 5వ గనిలో జనరల్ మజ్ధూర్‌గా పని చేస్తున్నారు. అదే గనిలో పని చేస్తున్న అండర్ మేనేజర్లు రాము, సంజయ్, దేవేందర్‌లకు ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి.
నేటి ప్రజావాణి రద్దు
నేటి ప్రజావాణి రద్దు
Comments
Please login to add a commentAdd a comment