మేడారం పరిసరాలు క్లీన్
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక–సారలమ్మ మినీజాతరలో పారిశుద్ధ్య కార్మికులు షిఫ్టుల వారీగా పనిచేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. జాతర వారం రోజుల ముందు నుంచి స్థానిక పారిశుద్ధ్య కార్మికులతోపాటు రాజమండ్రి నుంచి కార్మికులను అధికారులు రప్చించారు. దీంతో జాతరలో సుమారు 400 మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారు. జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి పడేసిన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. తిరుగువారం వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగనున్నాయి.
10 ట్రాక్టర్లలో చెత్త తరలింపు..
జాతర ముందు, జాతర నాలుగు రోజుల్లో సుమారు 5వేల టన్నుల చెత్త సేకరించారు. ఈ చెత్తను కార్మికులు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ ప్రాంతాలకు తరలించారు. జాతరలో రోజుకు 10 ట్రాక్టర్ల ద్వారా రెండు షిప్టుల వారీగా చెత్త తరలింపు కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం తిరుగువారం పండుగ వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు. తిరుగువారం అనంతరం పారిశుధ్ధ్య పనులను స్థానిక గ్రామ పంచాయతీ అధ్వర్యంలో చేపట్టనున్నట్లు తెలిపారు.
గద్దెల ప్రాంగణంలో..
అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో భక్తులు వేసే బంగారం (బెల్లం), కొబ్బరినీళ్లు, ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, ఇతర వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. గద్దెల ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు కార్మికులను జిల్లా పంచాయతీశాఖ ఆధ్వర్యంలో నియమించా రు. వీరు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తూ ఎప్పటికప్పుడు గద్దెల వద్ద చెత్తాచెదారం తొలగిస్తున్నారు.
భక్తులకు మెరుగైన సేవలందించాం..
మేడారం మినీజాతరలో భక్తులకు మెరుగైన సేవలందించాం. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా జాతరకు 10 రోజుల ముందు, జాతర నాలుగు రోజుల్లో 400 మంది కార్మికులు నిత్యం విధుల్లో ఉంటూ మెరుగైన సేవలందించారు. తిరుగువారం పండుగ వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తాం. డీఎల్‌పీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సమష్టిగా పనిచేయడంతో భక్తులకు మెరుగైన పారిశుద్ధ్య సేవలను అందించాం. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు ఎక్కడా కూడా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం.
– దేవరాజ్, డీపీఓ
మేడారం పరిసరాలు క్లీన్
మేడారం పరిసరాలు క్లీన్
Comments
Please login to add a commentAdd a comment