రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్ట్
కాటారం: ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో కాటారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు మంగళవారం ఆన్‌లైన్ పద్ధతిలో రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. గతంలో జిల్లాస్థాయిలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న మణిదీప్, అలేఖ్య, అభిరాంకళ్యాణ్ ఈ టాలెంట్ టెస్ట్‌లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. అనంతరం విద్యార్థులను అభినందించి సన్మానించారు. ఈ సందర్బంగా ఎంఈఓ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకొని భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా దేశానికి సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం ఉమారాణి, ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గండు రాజబాబు, ఉపాధ్యాయులు రాజేందర్, రాజయ్య పాల్గొన్నారు.
నేడు తిరుగువారం పండుగ
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క–సారలమ్మ పూజారులు నేడు (బుధవారం) తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. అమ్మవార్ల ఆలయాలను శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం అమ్మవార్ల వస్త్రాలు, పూజా సామగ్రిని భద్రపరుస్తారు. అమ్మవార్లకు యాట నైవేద్యంగా సమర్పించనున్నారు. తిరుగువారం పండుగ రోజు పూజారుల కుటుంబీకులు, స్థానిక గ్రామస్థులు ఇళ్లను శుద్ధి చేసుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. తిరుగువారం పండుగతో మినీజాతర (మండమెలిగె) పండుగ పూజా కార్యక్రమాల ముగియనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment