కాటారం: గ్రామాల్లో వలసలు తగ్గించి స్థానికంగానే ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన జాతీయ ఉపాధిహామీ పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంపై విధి విధానాలు మారుస్తుండడంతో క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరు అగమ్యగోచరంగా మారిపోయింది. గతంలో ఉపాధి పనులను పూర్తిస్థాయిలో వినియోగించుకున్న కూలీలు ప్రస్తుతం పనుల పట్ల పూర్తిస్థాయి విముఖత చూపిస్తున్న పరిస్థితి నెలకొంది. కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్ కారణంగా ఉపాధి పనులపై పెరిగిన ఆంక్షలతో గ్రామాల్లో పనులకు వచ్చే కూలీల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. జిల్లాలోని మొత్తం కూలీలలో కనీసం 10శాతం కూలీలు కూడా ఉపాధి పనులకు రావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment