విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తం
ములుగు రూరల్: విద్యుత్ ప్రమాదాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి సర్కిల్ డీఈఈ(టెక్నికల్) వెంకటేశం, ములుగు డీఈఈ నాగేశ్వర్‌రావు సూచించారు. ఈ మేరకు మండల పరిధిలోని జగ్గన్నపేట రైతులకు మంగళవారం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు కెపాసిటర్లు బిగించడం వల్ల కలిగే లాభాలను వివరించారు. విద్యుత్ పరికరాలను తడి చేతులతో ముట్టుకోకూడదని, చార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడకూడదని సూచించారు. విద్యుత్ సర్వీస్ వైరు నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని సూచించారు. వ్యవసాయ కనెక్షన్ల క్రమబద్ధీకరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఏడీఈ వేణుగోపాల్, ఏఈ బానోత్ రవి, ఏఎల్‌ఎం కమలాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment