సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

Published Wed, Feb 19 2025 1:01 AM | Last Updated on Wed, Feb 19 2025 1:01 AM

-

ఏటూరునాగారం: సాంకేతిక విజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని పీఎం ఎస్‌ఆర్‌ఐ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల స్కూల్‌ అసిస్టెంట్‌ లక్ష్మణ్‌ తెలిపారు. మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 130 మంది మంగళవారం హనుమకొండలోని ఎన్‌ఐటీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్య, శాసీ్త్రయ విద్య పెంపొందించేందుకు స్టెమ్‌ సంస్థ ద్వారా స్టడీ టూర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించామని వివరించారు. ఈ టూర్‌లో పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement