కల్యాణం.. కమనీయం
రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతీ నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. మంగళవారం అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణం జరిపించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మహేష్, చై ర్మన్ ముల్కనూరి భిక్షపతి, కాంగ్రెస్ రాష్ట్ర నా యకులు కత్తి వెంకటస్వామి, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, భక్తులు పాల్గొన్నారు.
నాగేపల్లిలో వైద్యశిబిరం
కాళేశ్వరం: కాళేశ్వరం పీహెచ్‌సీ పరిధిలోని అన్నారం సబ్‌సెంటర్‌లోని నాగేపల్లిలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మిత ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మంగళవారం 38మందికి వైద్య పరీక్షలు చేశారు. 14 మంది రక్తనమూనాలు సేకరించి మలేరియా రాపిడ్ టెస్టులు చేసి మందులు పంపిణీ చేశారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్య, సబ్ యూనిట్ ఆఫీసర్ రమేష్, ఎంపీఓ ప్రసాద్, పీహెచ్‌ఎస్ నీరజ, హెల్త్ అసిస్టెంట్ అడప రాజరమణయ్య, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు.
డ్రంకెన్‌డ్రెవ్ కేసులో
ఒకరికి జైలు శిక్ష
భూపాలపల్లి అర్బన్: మద్యం తాగి జిల్లాకేంద్రంలో వాహనం నడుపుతూ పట్టుబడిన కేసులో ఒకరికి జైలు శిక్ష పడినట్లు సీఐ నరేష్‌కుమా ర్ తెలిపారు. పట్టణంలోని సుభాష్‌కాలనీకి చెందిన అల్వాల వంశీ ఇటీవల మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడగా కోర్టులో ప్ర వేశపెట్టారు. రెండు రోజుల జైలు శిక్ష, రూ.వే యి జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.
గుడుంబా పట్టివేత
కాటారం: మండలంలోని ఆదివారంపేటలో ఓ మహిళ గుడుంబా విక్రయిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మ్యాక అభినవ్ తెలిపారు. గుడుంబా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు దుర్గం లక్ష్మి ఇంట్లో తనిఖీ చేయగా 10 లీటర్ల గుడుంబా లభించినట్లు ఎస్సై పేర్కొన్నారు. గుడుంబా స్వాధీనం చేసుకుని లక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా గుడుంబా తయారీ, రవాణ, విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
కాటారం: మండలంలోని విలాసాగర్ మానేరు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై మ్యాక అభినవ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ సిబ్బంది విలాసాగర్, గంగారం గ్రామాల మధ్య పెట్రోలింగ్ నిర్వహిస్తూ గంగారం క్రాస్ వద్ద ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను నిలిపి పత్రాలు అడిగారు. ఇసుక రవాణాకు సంబంధించి అనుమతి పత్రాలు లేకపోవడంతో పాటు వాహన పత్రాలు, డ్రైవర్‌కు లైసెన్స్ లేనట్లు గుర్తించారు. దీంతో ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
గోదావరి పరిసర ప్రాంతాల్లో సర్వే
కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలో గోదావరి నీటి ప్రవాహంపై కేంద్ర జలశక్తి శాఖ(సీడబ్ల్యూసీ)ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. మంగళవారం సర్వే జేఈఈ సందీప్ ఆధ్వర్యంలో సర్వే బృందం గోదావరి, పరిసర ప్రాంతాల్లో సర్వే చేశారు. ప్రతి వర్షాకాలంలో గోదావరిలో వరదల కారణంగా కోతకు గురైన ప్రాంతాన్ని సర్వే చేస్తున్నారు. వర్షాకాలంలో ఎంత మేర నీటిమట్టం ప్రవహిస్తుంది, కోతకు గురైన తరువాత ఎంత మేర ప్రవహిస్తుందనే హెచ్చుతగ్గులను సర్వే చేసి వర్షాకాలంలో దీని ఆధారంగా నీటి లెక్కలను సీడబ్ల్యూసీ అధికారులు చెబుతారని ఆయన వివరించారు. ఆయన వెంట సర్వే బృందం ఉన్నారు.
కల్యాణం.. కమనీయం
కల్యాణం.. కమనీయం
Comments
Please login to add a commentAdd a comment