భోజన సౌకర్యం మెరుగుపరచాలి
భూపాలపల్లి: ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, సంక్షేమ గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహారం, భోజన సౌకర్యాల అమలును మరింత మెరుగుపరిచేందుకు మండల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని మండలాల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో భోజన నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు. ఇదొక నిరంతర ప్రక్రియగా జరగాలన్నారు. ఆహార పదార్థాల శుభ్రత, పోషక విలువలు, వంట గదుల నిర్వహణ, భోజన పరిమాణం, మెనూ అమలు తదితర అంశాలను గమనించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తొద్దు..
వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా సమగ్ర కార్యచరణ ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైదరాబాద్ నుంచి మంగళవారం వివిధ అంశాలపై ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలోని 53 సొసైటీల్లో యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. క్రమం తప్పక వ్యవసాయ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. తాగునీటి కొరత వచ్చిన గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, స్థానిక వనరులను గుర్తించాలని తెలిపారు. లీకేజీలు అరికట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment