విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలి
చిట్యాల: టెన్త్ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సన్నద్ధం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలను డీఈఓ సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకుని అత్యుత్తమ మార్కులు సాధించాలని కోరారు. సెక్టోరియల్ ఆఫీసర్ రాజగోపాల్ విద్యార్థులను వివిధ సబ్జెక్టులలో ప్రశ్నలను అడిగి జవాబులు తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాం రఘుపతి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజమౌళి, నీలిమారెడ్డి, విజయలక్ష్మి, కల్పన, మౌనిక, ఉస్మాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్ సూదం సాంబమూర్తి పాల్గొన్నారు.
ఉత్తీర్ణత శాతం పెంచాలి
మొగుళ్లపల్లి: పదిలో జీపీఏ సాధనే లక్ష్యంగా ప్రతీ విద్యార్థి శ్రద్ధగా చదవాలని డీఇఓ రాజేందర్ అన్నారు. మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మొట్లపల్లి, పిడిసిల్ల, ముల్కలపల్లి పాఠశాలలను డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను, విద్యార్థుల ప్రగతి రికార్డులను, ఉపాధ్యాయుల డైరీలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. టెన్త్ విద్యార్థులు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకొని సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు. డీఈఓ వెంట జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి, నరసింహస్వామి, శ్రీనివాస్, మహేష్, కోటేశ్వర్, శ్రీమంజరి, వెంకన్న, అనిల్‌కుమార్ ఉన్నారు.
డీఈఓ రాజేందర్
Comments
Please login to add a commentAdd a comment