భూపాలపల్లి అర్బన్: సామాన్యుల వద్దకే న్యాయసేవలు తీసుకెళ్లడంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ చొరవ తీసుకుంటుందని డిప్యూటీ, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ కంప అక్షయ, ప్రియాంక తెలిపారు. మున్సిపల్ పరిధిలోని వేశాలపల్లిలో బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ బృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన, నిమ్న కులాల వారికి, మహిళలకు, వయో వృద్ధులకు ఉచిత న్యాయసాయం అందించడమే జిల్లా న్యాయసేవాధికార సంస్థ లక్ష్యమని తెలిపారు. మార్చి 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment