రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలాలను భూపాలపల్లికి రవాణా చేయడంలో ప్రస్తుతం ఇద్దరు వ్యాపారుల హవా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందిన ఓ వ్యాపారి, గోదావరిఖనికి చెందిన మరో వ్యాపారి భూపాలపల్లి జిల్లా కేంద్రంతోపాటు కాటారం డివిజన్‌ను గుత్తా పట్టినట్లుగా తమ దందాను కొనసాగిస్తోండడం గమనార్హం. తమ సొంత వాహనాల్లో ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో రూ.15 లక్షలకు పైగా విలువైన సరుకును జిల్లాలోని హోల్‌సేల్, కిరాణా షాపులు, మధ్య దళారులకు దిగుమతి చేస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు వ్యాపారులు కొయ్యూరు మీదుగానే రవాణా చేస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరినీ కట్టడి చేస్తే జిల్లాలో నూటికి 90 శాతానికి పైగా నిషేధిత పొగాకు ఉత్పత్తుల దందా ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే హనుమకొండకు చెందిన ఓ వ్యాపారి ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌ల ద్వారా గుట్కాలను భూపాలపల్లి జిల్లాకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment