రేగొండ: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు కావాలా..? అంటూ వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించిన ఓవ్యక్తి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు ఖాళీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నారాయణపురానికి చెందిన పోలు తిరుపతికి జనవ రి 24న 6268040772 నంబరు నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు కావాలా..? అని కాల్ వచ్చింది. ఒకే అనడంతో అవతలి వ్యక్తి పంపిన లింక్‌ను తిరుపతి ఓపెన్ చేయగా వచ్చిన ఓటీపీని నేరగాళ్లకు చెప్పా డు. దీంతో ఖాతా నుంచి రూ.12 వేల నగదు బదిలీ అయింది. బుధవారం బాధితుడి ఫిర్యాదుతో ఎస్సై సందీప్‌కుమార్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment