వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు కాస్త ఉక్కపోతగా ఉంటుంది. రాత్రిపూట కాస్త చలిగా ఉంటుంది.
పకడ్బందీగా
ఇంటర్ పరీక్షలు
● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
భూపాలపల్లి అర్బన్: ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై గురువారం తన చాంబర్‌లో ఇంటర్మీడియట్ అధికారి, పోలీస్, ఆర్టీసీ, విద్యుత్, వైద్యఆరోగ్యశాఖ, మున్సిపల్, పోస్టల్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి, రెండో సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రఽథమ సంవత్సరంలో 1,820 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,795 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఒకటి, సిట్టింగ్ స్క్వాడ్ 2, జిల్లా పరీక్షల కమిటీ ఒకటి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ అధికారి వెంకన్న, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మల్చూర్‌నాయక్, ఆర్టీసీ డీఎం ఇందు, డీఎస్పీ నారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పోస్టల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు.
జిల్లాస్థాయి క్రీడాపోటీలు
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 24, 25వ తేదీల్లో జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించనున్నట్లు నెహ్రు యువకేంద్రం జిల్లా అధికారి చింతల అన్వేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాలీబాల్, రన్నింగ్, షటిల్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 18 ఏళ్ల నుంచి 29 ఏళ్లలోపు యువతీ, యువకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వివరాలకు 96408 81670, 76590 71405 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment