రైతులపై దాడులు సరికాదు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం ఆజాంనగర్ గ్రామంలో రైతులపై ఫారెస్ట్ అధికారులు చేసిన దాడులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఖండించారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 30 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. రైతులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారులు తీరు మార్చుకోవాలని సూచించారు.
దోషులను శిక్షించాలి..
15వ వార్డు మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్యవెనుక దోషులు ఎంతటివారైనా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఈ దాడిపై పోలీసులు సమగ్ర విచారణ చేసి త్వరగా దోషులను గుర్తించి శిక్షపడేలా చూడాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవడానికి అనేకమార్గాలు ఉన్నాయని.. ఇలా హత్యలు చేయడం సమస్యకు పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలన్నారు. విచారణలో పూర్తి వాస్తవాలు బయటకు రాకపోతే ప్రభుత్వం నుంచి సీబీసీఐడీతో విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, అధికార ప్రతినిధి గాజర్ల అశోక్,, టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు, నాయకులు పిప్పాల రాజేందర్, జోగుల సమ్మయ్య, కప్పల రాజేష్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment