కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం రాత్రి మళ్లీ చోరీ జరిగింది. కాళేశ్వరం గ్రామానికి చెందిన తాజ్‌బాబా కూల్‌డ్రింక్స్ దుకాణం తాళం పగులగొట్టి రూ.6వేల వరకు నగదు దొంగిలించారు. ఇదే రాత్రి మజీద్‌పల్లిలోని కూరపాటి మహేష్, ముంగి రాజయ్య కిరాణం, ముంగి మహేష్ ఇంటి తాళం పగులగొట్టినా నగదు, వస్తువులు పోలేదని బాధితులు పేర్కొన్నారు. ఈనెల 6న కాళేశ్వరానికి చెందిన ముంగి రాజేష్ ఇంటి తాళం గడ్డపారతో పగులగొట్టి రూ.10వేలు అపహరించారు. అదే రాత్రి చిన్న అడప సమ్మయ్య ఇంటితాళం కూడా పగులగొట్టగా అక్కడ ఎలాంటివీ పోలేదు. వరుసగా ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలు జరుగుతున్నా పోలీసులు దొంగలను గుర్తించడం లేదు. దీంతో జనం తాళం వేసి ఊరికి వెళ్లాలంటే బెంబేలెత్తుతున్నారు. రాత్రిపూట భయబ్రాంతులకు గురవుతున్నారు. కాళేశ్వరంలో ప్రధాన రహదారి, పలు వార్డుల్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. పోలీసులు కూడా చోరీలపై దృష్టిసారించడం లే దు. ఈ విషయమై ఎస్సై తమాషారెడ్డిని సంప్రదించగా ఒక అనుమానితుడిని కనిపెట్టినట్లు తెలి పారు. పట్టుకొని వివరాలు వెల్లడిస్తామన్నారు.
పనిచేయని సీసీ కెమెరాలు
దృష్టిసారించని పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment