మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

Published Sat, Feb 22 2025 1:55 AM | Last Updated on Sat, Feb 22 2025 1:51 AM

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

భూపాలపల్లి రూరల్‌: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా కృషిచేయాలని అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి సూచించారు. జిల్లాకేంద్రంలోని సమాఖ్య భవనంలో డీఆర్‌డీఓ నరేష్‌ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సమాఖ్య సంఘాల సభ్యులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో రుణాలు అందిస్తుందన్నారు. మహిళా సంఘాలు, మహిళా సభ్యులు అందరూ ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, వీఓలు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement