ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) ఎల్‌వీ సూర్యనారాయణ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఏరియాలో పర్యటించారు. అధికారులతో జీఎం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. భూపాలపల్లి ఏరియాలో ఉత్పత్తి శాతం ఆశించిన స్థాయిలో లేదన్నారు. ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్మికుల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. రక్షణ నియమాలు పాటిస్తూ సంస్థ పురోగతికి కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సింగరేణి జనరల్ రాజేశ్వర్‌రెడ్డి, అధికారులు కవీంద్ర, వెంకటరామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటరమణ, భిక్షమయ్య, మారుతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment