ముందస్తు ఉగాది వేడుకలు నిర్వహిస్తున్న మహిళలు
కాటారం: మండలకేంద్రంలోని అయ్యప్ప కాలనీలో మహిళలు శుక్రవారం ముందస్తు ఉగాది వేడుకలను నిర్వహించారు. స్థానిక శ్రీ హర్షిత డిగ్రీ కళాశాలలో మహిళలంతా కలిసి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేశారు. భక్తిశ్రద్ధలతో పాటలు పాడి పూజలు చేశారు. అనంతరం ఉగాది పచ్చడి, భక్ష్యాలను స్వీకరించి కాలనీలో పంపిణీ చేశారు. మహిళలు ఒకరికొకరు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పడకంటి అంజలిని పలువురు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గుండూరి పద్మ, రామగిరి శ్రీదేవి, మాధవి, రాజేశ్వరీ, పడకంటి అంజలి, కళ, స్వప్న, కల్పన, సంధ్య, లహరి, పద్మ, జ్యోతి, రాధ, విజయ, సుజాత, నీరజ, పావని తదితరులు పాల్గొన్నారు.