
సోలార్ పంపులతో మూగజీవాలకు తాగునీరు
కాళేశ్వరం: ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అటవీశాఖ అధికారులు మూగజీవాల దాహార్తి తీర్చేందుక సోలార్ పంపులు సిద్ధం చేస్తున్నారు. ఎండలు మండిపోతుండడంతో చెరువులు, కుంటల్లో నీరు వట్టిపోతున్న విషయం తెలిసిందే. మంగళవారం మహదేవపూర్ రేంజ్ పరిధిలోని కాళేశ్వరం తదితర అటవీ ప్రాంతాల్లో సోలార్ పంపుసెట్‌లు ఏర్పాటు చేశారు. సోలార్ పంపుల ద్వారా చెరువులు, కుంటల్లో నీటిని నింపుతున్నారు. అడవుల్లో ఉన్న మూగ జీవాలకు నీటి కోసం 24 గంటల పాటు మోటార్ ఆన్‌చేసి ఉంచడంతో నీరు కుంటలు, చెరువుల్లో నిండి మూగ జీవాల దాహార్తి తీరనుంది. మహదేవపూర్, కాళేశ్వరం–2, నస్తూర్‌పల్లి, బొమ్మాపూర్, కుదురుపల్లి ఆరు చోట్ల సోలార్ సెట్ పంపులు ఉన్నాయి. కొన్ని రిపేర్లు ఉండగా మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకు వస్తున్నట్లు రేంజర్ రవి తెలిపారు. జంతు ప్రేమికులు అటవీ శాఖ అధికారులకు అభినందనలు చెబుతున్నారు.