
నేలవాలిన అరటితోటల పరిశీలన
చిట్యాల: మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామశివారులో సోమవారం వీచిన గాలిదుమారానికి అరటి పంటలు పూర్తిగా నేలవాలాయి. స్పందించిన ఉద్యాన శాఖ డివిజనల్ అధికారి సునీల్ బుధవారం ఆకుల సతీష్, గంపల మధుకర్, సూర సుధాకర్, క్యాతం భద్రయ్య, క్యాతం రాజయ్యలకు చెందిన అరటి పంటలను పరిశీలించారు. రెండు రోజులుగా వీస్తున్న గాలుల ప్రభావంతో అరటి తోటల్లో నష్టం వాటిల్లిందన్నారు. నష్టతీవ్రతపై ప్రాథమికంగా అంచనా వేసి జిల్లా అధికారులకు నివేదిక పంపించనున్నట్లు తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు.